రాజీనామాపై తగ్గిన డిఎల్, జగన్ వ్యాఖ్యలే బాధించాయి

DL Ravindra Reddy
హైదరాబాద్: శాఖల పట్ల అసంతృప్తితో తాను రాజీనామా చేసే వ్యక్తిని కాదని, శాఖ కోత పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, అయితే వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. 1978లోనే తనది స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర అన్నారు. ఆ తర్వాత తాను కాంగ్రెసు పార్టీలో చేరి ఇంత ఉన్నత స్థానానికి చేరుకున్నానని అన్నారు. తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిన పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయాలని తాను భావించలేదన్నారు. పార్టీకి తాను నిబద్ధత కలిగిన కార్యకర్తను అన్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తున్నానని అన్నారు. అయితే కొన్న దురదృష్టకర సంఘటనలు తనను కలిచి వేశాయన్నారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాను ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేశానని అన్నారు. నా విద్యుక్త ధర్మంలో తానెప్పుడూ తప్పు చేయలేదని, ఎవరైనా తనపై ఆరోపణలు చేస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. రాజకీయాల నుండి అయినా తప్పుకుంటాను కానీ తప్పు మాత్రం చేయనన్నారు. ఎవరైనా తన శాఖలో విచారణకు ఆదేశిస్తే తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాను ఎప్పుడూ మంత్రి పదవి కావాలని అడగలేదన్నారు. వారే పదవి ఇచ్చారన్నారు. శాఖల కేటాయింపులపై నిర్ణయం ముఖ్యమంత్రిదేనని చెప్పారు. తాను పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదన్నారు. శాఖ మీద అసంతృప్తితో తాను రాజీనామా చేసే వ్యక్తిని కాదన్నారు. తనకు శాఖను తగ్గించిన దానికంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే బాధించాయన్నారు. తన తండ్రి వైయస్సార్ రెక్కల కష్టంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పాలిస్తుందని జగన్ వ్యాఖ్యానించారని, వాటి పట్ల తాను చాలా ఆవేదన చెందానన్నారు. ఆయన వ్యాఖ్యలు ఎవరూ ఖండించక పోవడం బాధాకరమన్నారు. కార్యకర్తల రెక్కల కష్టం మీద మాత్రమే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందన్నారు. కార్పోరేషన్ పదవులు కార్యకర్తలకు ఇవ్వాలని ఆయన సూచించారు. పదవుల కోసం గడ్డితినే వ్యక్తులు మా పార్టీలో చాలామంది ఉన్నారని ఆరోపించారు. తాను కఠిన నిర్ణయం తీసుకుంటానని చెప్పిన మాట వాస్తవమేనని అయితే పార్టీ పెద్దలు నేను చెప్పిన దాంతో ఏకీభవించినందు వల్ వెనక్కి తగ్గానని అన్నారు.

కాగా అంతకుముందు డిఎల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆయనకు పలుమార్లు ఫోన్ చేసి రాజీనామా చేయవద్దని నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. పిసిసి చీఫ్ బొత్స, ఆజాద్‌లు బుజ్జగించడంతోనే ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా డిఎల్‌కు ఫోన్ చేసి బుజ్జగించారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+