మిస్‌ఫైర్: బొత్సకు గురిపెడితే మోపిదేవికి తగిలింది?

ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఎసిబి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మోపిదేవి వెంకటరమణ ఆత్మరక్షణలో పడ్డారు. బొత్స సత్యనారాయణ క్షేమంగా బయటి పడి మోపిదేవి ఇరుకున్నారనే అభిప్రాయం బలపడుతోంది. తనవారికి నాలుగు మద్యం దుకాణాలున్నాయని బొత్స సత్యనారాయణ బహిరంగంగానే చెప్పారు. కాగా, విజయవాడ లిక్కర్ సిండికేట్ వ్యవహారం కూడా సంచలం సృష్టిస్తోంది. రామ్మోహన్ అనే వ్యక్తిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకునని ప్రశ్నించారు. రామ్మోహన్ తాము ఎవరెవరికి లంచాలు ఇచ్చిందీ వివరించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications