సిబిఐ విచారణ, జగన్ అస్త్రం ఐఎఎస్ మహాపాత్రో

ఐఎఎస్ అధికారులను ప్రశ్నించవద్దని గానీ, వారిపై చర్యలు తీసుకోవద్దని గానీ తాను ఎప్పుడూ అనలేదని, విచారణలో వివక్ష ప్రదర్శించడాన్ని మాత్రమే తాను తప్పు పడుతున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. దెబ్బ తగిలినవారికే బాధ తెలుస్తుందని మహాపాత్రో అన్నారు. ప్రజాప్రతినిధులను కూడా ప్రశ్నిస్తామని సిబిఐ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా మంత్రి ఇంటికి వెళ్లి సిబిఐ అధికారులు ప్రశ్నించారని, మహిళా ఐఎఎస్ అధికారి విషయంలో అదే పద్ధతిని ఎందుకు పాటించలేదని ఆయన మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఇంటికి వెళ్లి విచారించడాన్ని, శ్రీలక్ష్మిని కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఐఎఎస్ అధికారులను అరెస్టు చేసినా తాము మౌనంగానే ఉన్నామని, అయితే ప్రజాప్రతినిధులను ఎందుకు వదిలేస్తున్నారని తాము అడుగుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications