యువతరంగం: బైక్ నడిపి ఉత్సాహపర్చిన చంద్రబాబు

Chandrababu Naidu
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ద్విచక్ర వాహనం(బైక్) నడిపి అందరినీ ఉత్సాహ పరిచారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువతరంగం కార్యక్రమానికి మొదటి వేదికగా విశాఖపట్నంను నిర్ణయించారు. ఇక్కడి శారదా గార్డెన్స్‌లో యువతరంగం ప్రారంభం కానుంది. దీనికి టిడిపి అధినేత నారా చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదిక వరకు బైక్ నడిపి యువతలో ఉత్సాహం నింపారు. టిడిపిలోని యువ కార్యకర్తలతో కలిసి ఆయన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు స్వయంగా అంబేడ్కర్ విగ్రహం నుండి వేదిక వద్దకు బైక్ నడుపుతూ చేరుకున్నారు. దీంతో యువ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. అంతకుముందు నగరంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను తమ పార్టీ వైపు తిప్పుకునే ఉద్దేశ్యంలో భాగంగా బాబు యువతరంగం కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ తదితర పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిమయమైన సమయంలో యువత అవినీతిపై పోరాటం సాగించేందుకు వీలుగా టిడిపి ఓ వేదికగా నిలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి యువత వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+