వైయస్ రాజశేఖర రెడ్డికి గుంటూరులో మరో ఆలయం

YSR Temple
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అభిమానులు గుడి కట్టారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో వైయస్ ఆలయానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహ ప్రతిష్టాపన చేసిన విషయం తెలిసిందే. ఆ ఆలయం ఇంకా పూర్తి కాలేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లాలో ఓ ఆలయం మాత్రం పూర్తయింది. నకరికల్లు మండలం కుంకలగుంటలో వైయస్ అభిమానులు ఓ గుడిని నిర్మించారు. దీనిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, అవి సామాన్యులకు ఎంతో ఉపయుక్తంగా మారాయని గ్రామస్తులు అంటున్నారు.

అలాంటి వైయస్ విగ్రహం తమ గ్రామంలో ఉంటే తమకు సుఖసంతోషాలు ఉంటాయనే విశ్వాసంతో వారు ఆలయాన్ని నిర్మించుకున్నారు. కుంకలగుంట గ్రామంలో వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. రూ.18 లక్షల రూపాయలతో దీనిని నిర్మించారు. ఇందులో ఆరడుగుల వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఓదార్పు యాత్రలో భాగంగా ఆ గ్రామానికి వచ్చినప్పుడు దీనిని ఆవిష్కరించారు. గ్రామంలో పలు వైయస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. కాగా బుధవారం గుంటూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+