కాలు జారిపడిన జయప్రద, వేదిక కూలి పడిన గడ్కరీ

Jayaprada
లక్నో: రాజకీయ నేత, మాజీ సినీ హీరోయిన్ జయప్రద మంగళవారం తూలి పడిపోయారు. జయప్రద ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మాజీ సమాజ్‌వాది పార్టీ నేత అమర్‌సింగ్ ఏర్పాటు చేసిన లోక్‌మంచ్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆమె సఖోపర్ గ్రామంలో ఒక సభలో మాట్లాడటానికి వెళ్లారు. ఈ సమయంలో ఆమె వేదిక ఎక్కబోతూ కాలుజారి అదుపు తప్పి కింద పడిపోయారు. ఆ తర్వాత ఆమె తమాయించుకొని లేచి వేదిక పైకి వెళ్లారు. క్రింద పడిన జయప్రదకు ఎలాంటి గాయాలు కాలేదు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి ప్రమాదం తప్పింది. ఆయన యుపి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మహమ్మదాబాద్ నియోజకవర్గంలోని రఘువర్‌గంజ్‌లో ఏర్పాటైన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు వేదికపై కూర్చున్నారు. అయితే వేదిక పైకి ఎక్కువ మంది రావడంతో బరువు తట్టుకోలేక కూలిపోయింది. ఈ ఘటనలో గడ్కరీతో పాటు మిగిలిన నేతలు అందరూ కిందపడ్డారు. అయితే గడ్కరీతో సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+