న్యూఢిల్లీ: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న లఘు విమానం టైర్లు బద్దలయ్యాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో విమానం దిగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రాజకీయ ప్రదర్శనలో పాల్గొనడానికి ఆజాద్ అమరావతి జిల్లాకు వచ్చారు. ఆయన క్షేమంగా ఉన్నారు.
అకోలా నుంచి ఆయన అమరావతికి ప్రయాణించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కొంత మంది కూడా విమానంలో ఉన్నారు. పైలట్ సమయస్ఫూర్తితో విమానాన్ని దింపాడు. వివరాలు అందించాల్సి ఉంది.
Union Health Minister Ghulam Nabi Azad had a narrow escape today when the tyres of a small jet he was traveling in burst while landing in Maharashtra's Amravati district.