హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటులో జాప్యం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ నాయకుల వ్యూహం కారణంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిపై అనర్హత వేటు వేయడానికి శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెసు పార్టీలోని అంతర్గత రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ అనర్హత వేటును వాయిదా వేసేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు ముందే వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది శాసనసభ్యులపై వేటు పడుతుందని, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తారని భావించారు. కానీ అది మార్చి మొదటివారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతనే వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు వేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు రాజకీయం నడుపుతున్నట్లు సమాచారం. ఏడు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే వారిపై అనర్హత వేటు వేస్తే రాష్ట్రంలో 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరుగుతాయి. దానివల్ల తమకు ఇబ్బంది ఏర్పడుతుందని కాంగ్రెసు నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలను వాయిదా వేయడానికి తగిన రాజకీయం నడిపినట్లు చెబుతున్నారు.

ఒకేసారి 24 స్థానాలకు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెసు పార్టీ భయపడుతున్నట్లు చెబుతున్నారు. దాదాపు మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఆ ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం కష్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే అనర్హత వేటును వాయిదాకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, తమను శాసనసభలో ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు స్పీకర్‌ను కోరడానికి సిద్ధపడుతున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి.

English summary
It is said that Assembly speaker Nadendla Manohar may not take action against YS Jagan camp MLAs at present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X