హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబులాంటి వారివల్లే రాజకీయాలు పలుచన: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ఉన్నందునే రాజకీయాలు అంటే ప్రజల్లో పలుచన ఏర్పడిందని బొత్స అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి గవర్నర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. గవర్నర్‌పై బాబు చేసిన వ్యాఖ్యలు గొడ్డలి పెట్టవంటివన్నారు. దేవుడు ఆయనను ప్రతిపక్ష నేతగా ఎలా చేశాడో అని ఎద్దేవా చేశారు. వినడానికి ఇబ్బందికరంగా ఉండేలా మాట్లాడవద్దని సూచించారు. పైసాకు పనికి రాని టిడిపి నేతలు మాపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. గవర్నర్ అభివృద్ధిని అంకెలతో సహా చెప్పారని అలాంటప్పుడు ఇంకా ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేత గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించలేదని మొదటిసారి బాబు బహిష్కరించారని ఇది శోచనీయమన్నారు. తొమ్మిదేళ్లు పని చేశానని, తనకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని బాబు అనవచ్చునని, కానీ టిడిపికి కార్యాచరణ, విధానం, పద్ధతి లేనందునే ప్రజలు విశ్వసించడం లేదనే విషయాన్ని గమనించాలన్నారు.

ప్రతిపక్ష నేతగా బాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బహిష్కరించారన్నారు. రాజ్యాంగంపై బాబుకు నమ్మకం లేదని తేలిపోయిందన్నారు. ఆయన ఎప్పుడూ అవినీతి, మద్యంను పట్టుకు వేలాడుతున్నారన్నారు. ఒక వేలును ఇతరుల వైపు చూపిస్తే మరో వేలు మనలను చూపిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ పైన స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. స్టే ఎత్తివేత తీసేయించుకొని విచారణ ఎదుర్కొన్న తర్వాతే బాబు అవినీతిపై మాట్లాడాలన్నారు. తనపై ఏ కేసు వేసినా తాను స్టే తెచ్చుకోనని బొత్స స్పష్టం చేశారు. ఒకరి గురించి మాట్లాడే ముందు మనం ఎంత నీతివంతులమో తెలుసుకోవాలన్నారు. బాబు అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

తనకు 31 మద్యం దుకాణాలు ఉన్నాయని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. తన బంధువులు, మిత్రులు తదితరులకు మాత్రమే ఉన్నాయని చెప్పానని, వాటిని కూడా ఎలాంటి అక్రమాలు లేకుండా నడపాలని సూచించానని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నేతలు మాట మీద నిలబడాలన్నారు. బాబు ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. విలువ పోగొట్టుకోవద్దన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేయడం లేదని, తప్పు తెలుసుకుంటే చాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు మనం తప్పకుండా గౌరవం ఇవ్వాల్సిందేనని అన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana accused that politics polluted like TDP chief Nara Chandrababu Naidu type leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X