హీనాకు ఫోన్: చిక్కుల్లో ఇండియన్ యువకుడు

ఈ ఘటన రెండు నెలల క్రితం చోటు చేసుకుందన్నారు. నెల రోజుల క్రితం ఢిల్లీ నుండి సిబిఐ అధికారులు వచ్చి వెళ్లారన్నారు. ఆదివారం బెంగళూరు సిసిబి అధికారులు గ్రామానికి వెళ్లి విచారించారు. ఆ యువకుడు ఆరోపణలు ఖండిస్తున్నారన్నారు. అయితే ఇప్పటి వరకు సిసిబి అధికారుల నుండి ఎలాంటి పూర్తి నిర్ధారణ సమాచారం రాలేదన్నారు. బాధిత యువకుడు ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వద్ద అటెండర్‌గా పని చేస్తున్నాడు. తాను ఇప్పటి వరకు రబ్బాని ఖర్ పేరు వినలేదని, తనకు ఆమెతో మాట్లాడేందుకు ఇంగ్లీషు కానీ ఉర్దూ కానీ రాదని, అలాంటప్పుడు ఆమెకు తాను ఫోన్ చేసి ఎలా మాట్లాడతానని ఆవేదనతో చెప్పాడు. అయితే తన ఫోన్‌ను మరెవరైనా ఉపయోగించారో తనకు తెలియదన్నాడు. కాగా బాధితుడి తరఫున కోచింగ్ సెంటర్ లెక్చరర్లు కాల్ రికార్డులు చూపించమని కోరగా సిసిబి అధికారులు అందుకు నిరాకరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కాగా తాము మళ్లీ కాంటాక్ట్ చేసే వరకు ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయకూడదని పోలీసులు బాధిత యువకుడికి సూచించారు.












Click it and Unblock the Notifications