జగన్ ఆస్తుల కేసులోనూ శ్రీలక్ష్మి, రాజగోపాల్

వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడుల పెట్టిన కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి, రాజగోపాల్ ద్వారా చర్యలు తీసుకున్నారనే అనుమానంపై సిబిఐ వారి విచారణకు అనుమతిని కోరినట్లు తెలుస్తోంది. దాల్మియా సిమెంట్స్, అన్‌రాక్ సంస్థలకు గనుల లీజుపై సిబిఐ అధికారులు వారిద్దరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాము స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా వారిద్దరిని విచారించడం ద్వారా రాబట్టే సమాచారం ఆధారంగా జగన్ ఆస్తుల కేసులో పురోగతి సాధించవచ్చునని సిబిఐ అనుకుంటున్నట్లు సమాచారం.
కాగా, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మరో ప్రభుత్వాధికారి బాలకృష్ణను సిబిఐ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పెన్నా సిమెంట్స్ వ్యవహారాలపై సిబిఐ అధికారులు బాలకృష్ణను విచారించినట్లు తెలుస్తోంది.