హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి సిఎం పక్క ఖాళీలో కూర్చోవచ్చు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి ముందు సీటు కోసం కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని ఆపేశారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆరోపించారు. ఆయన మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. చిరంజీవికి ముందు సీటు కావాల్సి వస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పక్కన ఉన్న ఖాళీలో కూర్చోవచ్చు కదా అని సూచించారు. పోలవరం టెండర్లు దక్కలేదనే ఉద్దేశ్యంతోనే టిఆర్ఎస్ తమపై ఆక్రోశం వ్యక్తం చేస్తోందన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెసుతో లాలూచి పడిందన్నారు. టిడిపిని ఆ పార్టీ టార్గెట్ చేసుకోవడం సరికాదన్నారు. తాము వామపక్షాలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన వారికి 31 మద్యం దుకాణాలు ఉన్నాయని చెప్పడం ద్వారా నేరాన్ని అంగీకరించారన్నారు. ఎసిబి రిపోర్టులో ఉన్న మంత్రి పేరును వెంటనే బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎసిబి రిమాండ్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. మద్యం సిండికేట్లలో టిడిపి నేతలు ఉన్నా విడిచి పెట్టమని ఆయన హెచ్చరించారు.

శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించుదామని అంటే ఆకలవుతుందంటూ సభను వాయిదా వేశారన్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తమ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తుంటే బిఏసి సమావేశానికి ఎందుకు వెళ్లాలన్నారు. కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ కురిపిస్తోందన్నారు. సిండికేట్లలో తన వర్గానికి చెందిన మంత్రిని సిఎం కాపాడుకున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఆరోపించారని ఆ వ్యక్తి ఎవరో చెప్పాలన్నారు. గెలిచే సత్తా ఉంటే మీడియా ప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. కాంగ్రెసును ముప్పయ్యేళ్లు ఎదుర్కొన్న టిడిపికి టిఆర్ఎస్ ఓ లెక్క కాదన్నారు. ఎమ్మార్ వ్యవహారంలో ప్రక్షాళన జరగాలని, అవినీతిపరుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా టిడిపి నేతలు ఎసిబి డిజిని కలిశారు. మద్యం మాఫియాపై దాడులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎసిబి రిపోర్టును బహిర్గతం చేయాలని కోరారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu suggested Chiranjeevi about his seat in Assembly. He fired at TRS and YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X