హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం చేద్దాం?: కాంగ్రెస్ నేతలకు జగన్ ఎమ్మెల్యేల భయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెసు ఎమ్మెల్యేలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేల భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జగన్ వర్గం ఎమ్మెల్యేలు అందరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కండువాతో రావడంతో పాటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలలో ఒకేసారి ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టం లేని కాంగ్రెసు వారిపై వేటుకు వెనుకాడుతోంది. అదే సమయంలో ఎమ్మెల్యేలు మాత్రం దమ్ముంటే తమపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉప ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేకనే తమపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకోలేక పోతున్నారని వారు విమర్శిస్తున్నారు. పిఆర్పీ జగన్ వర్గం ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి మంగళవారం స్పీకర్‌కు లేఖ రాశారు. తన రాజీనామా ఆమోదించాలని లేదంటే స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించాలని అందులో పేర్కొన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తిస్తే వైయస్సార్సీ పార్టీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతానని అమె చెప్పారు. ధర్మాన కృష్ణదాసు, పిల్లి సుభాష్ చంద్ర బోసు వంటి వారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, ప్రజా సమస్యలపై కిరణ్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరిస్తున్నారు.

అయితే వారి హెచ్చరికలు కాంగ్రెసు పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయనే చెప్పవచ్చు. వేటు వేయమని వారు ఓ వైపు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పార్టీ ఉంది ప్రస్తుతం. అంతేకాదు సమావేశాల సందర్భంగా జగన్ ఎమ్మెల్యేలు సభలోకి నవ్వుతూ వస్తుంటే కాంగ్రెసు ఎమ్మెల్యేలు బిక్కచచ్చి పోతున్నారట. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో ఆ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగితే అంతకంటే దారుణం ఉండదని కాంగ్రెసు నేతలు వాపోతున్నారట. అయితే జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు ఆలస్యమవుతుందన్న విషయాన్ని సిఎం కొట్టి పారేస్తున్నారు. చర్యలకు తాము తీసుకున్న సమయం ఎంతో అసెంబ్లీలో చెబుతానని ఆయన అంటున్నారు.

English summary
It seems, YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mlas fear to Kiran Kumar Reddy government and Congress MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X