హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాలెంటైన్స్ డే: ఆరు జంటలకు భజరంగదళ్ పెళ్లిళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Valentines Day
హైదరాబాద్: వాలెంటైన్స్ డే సందర్భంగా భజరంగదళ్ కార్యకర్తలు మంగళవారం హైదరాబాదులో, హైదరాబాదు పరిసరాల్లో ఆరు ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేశారు. గండిపేటలో రెండు జంటలకు, ఇతర ప్రాంతాల్లో మరో నాలుగు జంటలకు వారు పెళ్లిళ్లు చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భజరంగదళ్ కార్యకర్తలు తాళిబొట్లతో ప్రేమ జంటల వెంట పడ్డారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వారు ప్రేమ జంటలకు వివాహాలు చేశారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ జంటలకు వివాహాలు చేయడానికి పూనుకున్న తమ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని భజరంగదళ్ ఖండించింది. తమ కార్యకర్తలు ఏ విధమైన విధ్వంసాలకు కూడా దిగలేదని, అయినా పోలీసులు తమ కార్యకర్తలను నాయకులను అరెస్టు చేశారని భజరంగదళ్ నగర అధ్యక్షుడు భరత్ వంశీ అన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడడానికే తాము వాలెంటైన్స్ డేను బహిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. అరెస్టుల ద్వారా పోలీసులు తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.

కాగా, ప్రేమికుల రోజు వరంగల్ జిల్లాలోని చిలువూరి గట్ట దేవాలయం సందడిగా మారింది. ఈ ఆలయంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే పెళ్లి తప్పక అవుతుందని ప్రేమికులు నమ్ముతారు. దీంతో పెద్ద యెత్తున ప్రేమ జంటలకు ఈ దేవాలయానికి వచ్చాయి. వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రేమికులు ఇక్కడికి వచ్చారు.

English summary
Bajarangdal has performed six marraiges in Hyderabad and its surroundings during Valentines day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X