హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇండిపెండెంట్‌గా గుర్తించండి: స్పీకర్‌కు శోభ నాగిరెడ్డి లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
హైదరాబాద్: నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాము స్ఫూర్తిగా తీసుకొని అసెంబ్లీలో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ వర్గం ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి మంగళవారం అన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తమపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకు వచ్చామని ఆమె చెప్పారు. తమపై చర్యలు తీసుకోనందున ప్రత్యేక గ్రూపుగా తమను పరిగణించాలని కోరుతున్నామన్నారు. అనర్హత విషయంలో మేం ఎంత వరకు చేయాలో అంత చేశామన్నారు. నిర్ణయం స్పీకర్ పైనే ఉందన్నారు. రైతాంగానికి అండగా ఉండేందుకే తాము అప్పుడు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశామన్నారు. ప్రభుత్వం కేవలం ఉపఎన్నికలకు మాత్రమే భయపడటం లేదని ఏ ఎన్నికలకు వెళ్లాలన్నా భయపడుతోందన్నారు. సర్పంచ్, స్థానిక, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతోందన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని, వాటిని అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. కాగా శోభా నాగి రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. తనను స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆమె లేఖలో కోరారు. అలాకాని పక్షంలో రాజీనామా ఆమోదించాలన్నారు. రాజీనామా ఆమోదించని పక్షంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తనను గుర్తిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని లేఖలో తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విలువలను తేల్చేది కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కాదని ప్రజలని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంగళవారం అన్నారు. ఆయన కోట్లు తిన్నారని నిత్యం విమర్సించడం సరికాదన్నారు. ఆయన తిన్నాడా లేదా అనే అంశం కోర్టులో త్వరలో తేలుతుందని చెప్పారు. కోర్టులో ఉన్న అంశంపై ఆయనను విమర్శించడం సరికాదన్నారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీయే స్వయంగా కాంగ్రెసుతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు తమపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp PRP MLA Sobha Nagi Reddy blamed Congress Party for bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X