హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం మాఫియాలో సిఎం కిరణ్ ప్రమేయం: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: మద్యం మాఫియాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమేయముందని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో అన్నారు. అసెంబ్లీ రెండోసారి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధారాలతో ఎసిబి రిమాండ్ రిపోర్టు ఉందన్నారు. మద్యం మాఫియాను ప్రభుత్వమే నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తనయుడి పేరుతో ఈగిల్ కంపెనీకి అగ్రిమెంట్ ఉందన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మోపిదేవిలకు మద్యం మాఫియాతో సంబంధం ఉందని విమర్శించారు. ఇందులో సిఎం ప్రమేయం ఉందన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ యుపిని ఎపిలా మారుస్తానని అంటున్నారని, అంటే ఇలాగే అక్కడా దోచుకుంటారా అని ప్రశ్నించారు. వారు అసలైన గాంధీ వారసులు కారన్నారు. వారి పేర్ల చివర ఉన్న గాంధీ పేరును వెంటనే తీసువేయాలన్నారు. మద్యంపై చర్చ జరిగితే ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందోననే భయం కాంగ్రెసుకు పట్టుకుందన్నారు. మోపిదేవి హయాంలో అదనపు ఉత్పత్తికి లైసెన్సులు ఇచ్చారన్నారు. గాంధీ భవనంను బ్రాందీ భవనంగా మార్చారన్నారు.

కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తోడు దొంగలు అని మోత్కుపల్లి నర్సింహులు విమర్సించారు. టిఆర్ఎస్ కేంద్రంతో లాలూచి పడి అసెంబ్లీలో ఆందోళన చేయడమేమిటని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తున్నాయనే ఆ పార్టీ తెలంగాణ అంటూ మరోసారి నాటకానికి తెరలేపిందన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై కేసులు ఎత్తి వేయకుండా తప్పించుకుంటుందని ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు. విద్యార్థులను, ఉద్యోగులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మోసగించారని ఆయన ఆరోపించారు.

English summary
Telugudesam Party blamed CM Kiran Kumar Reddy for liqor syndicate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X