న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల తర్వాత మళ్లీ పెట్రోల్ వాత పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల ఆరంభంలో పెట్రోల్ ధర లీటరుకు మూడు రూపాయల చొప్పున పెరిగే అవకాశాలున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ధరలు పెరిగినప్పటికీ గత రెండు నెలలుగా దేశంలో పెట్రోల్ ధరలు పెంచలేదని, ఎన్నికలు పూర్తయ్యే వరకు పెంచకూడదని ప్రభుత్వం నోటి మాటగా ఆదేశించడంతో పెట్రోల్ ధరలను సవరించలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం అధికారులు చెప్పారు.
ధరలను పెంచకూడదని ప్రభుత్వం చెప్పడంతో ఈసారి చమురు కంపెనీలు నష్టపరిహారాన్ని అడిగే అవకాశాలున్నాయి. ఎప్పుడు, ఏ మేరకు పెంచుతారనే విషయంపై మాట్లాడడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ బుటోలా నిరాకరించారు. అయితే పరిస్థితి మాత్రం చాలా క్లిష్టంగా ఉందని అన్నారు. సంస్థ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదని, పెట్రోల్ ధరను పెంచక తప్పదని ఆయన అన్నారు.
Petrol prices are expected to rise by about Rs 3 per litre early next month after the crucial assembly election in Uttar Pradesh, industry executives said on Monday.
Story first published: Tuesday, February 14, 2012, 11:55 [IST]