కెసిఆర్ వల్లే తెలంగాణ రాలేదు: రేణుకా చౌదరి ఫైర్

తెరాస శాసనసభ్యులు శాసనసభా కార్యక్రమాలను అడ్డుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. తెలంగాణపై చర్చించే సత్తా లేకనే తెరాస శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. అది ప్రజాస్వామ్య పద్ధతి కాదని, శాసనసభలో ప్రశ్నించాలని, అడ్డుకోవడం సరి కాదని ఆమె అన్నారు. తప్పించుకోవడానికే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. బెదరింపులకు కాంగ్రెసు భయపడదని ఆమె అన్నారు.
సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివరణను కోరిందని, ముఖ్యమంత్రి వివరణ వచ్చిన తర్వాత స్పందిస్తామని ఆమె అన్నారు.