తెలంగాణ - టిడిపి ఫోరం ఓ డ్రామా కంపెనీ: కెటిఆర్

తెలంగాణవాదంపైనే ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని, ఇందుకు ఈ నెల 29వ తేదీ వరకు చంద్రబాబుకు గడువు ఇస్తున్నామని ఆయన అన్నారు. ఉప ఎన్నికలకు, తెలంగాణవాదానికి సంబంధం లేదని తెలుగుదేశం తెలంగాణ నాయకులు అనడం మూర్ఖత్వమని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.