ఉప ఎన్నికల్లో పోటీకి బిజెపి, తెరాస బుజ్జగింపు

బిజెపి పోటీ చేస్తే కొంత మేరకు తెలంగాణ ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో బిజెపిని బుజ్జగించే పనిలో కెసిఆర్ పడినట్లు చెబుతున్నారు. పోటీని నివారించడానికి తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలు జరుగుతున్న కొన్ని నియోజకవర్గాల్లో బిజెపికి చెప్పుకోదగిన బలం ఉంది. పైగా, నిబద్ధతతో కూడిన క్యాడర్ ఆ పార్టీకి ఉంది. దీంతో బిజెపి పోటీ చేస్తే ఆ ఓట్లు పోతాయనే ఉద్దేశంతో తెరాస నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications