సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి

గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గుడిసెలోని సిలిండర్ పేలడంతో ప్రారంభమైన మంటలు ఇతర గుడిసెలకు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్యపై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. కూలీ చేసుకునేవారే ఎక్కువగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చేసుకుంది. బాధితులు మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు చెందిన కూలీలు అని తెలుస్తోంది.
ప్రమాదవశాత్తు మాత్రమే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. గుడిసెలను ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే నిప్పు పెట్టించారనే అనుమానాలు వ్యక్తమవుతున్న స్థితిలో పోలీసులు ఆ వివరణ ఇచ్చారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications