కెసిఆర్ పేరు చెప్పి తెలంగాణపై చంద్రబాబు దాటవేత

తమ పార్టీకి జాతీయ రాజకీయాలు కొత్త కాదని ఆయన అన్నారు. గతంలో ఇద్దరు ప్రధానులను, ఓ రాష్ట్రపతిని తాము సూచించామని ఆయన అన్నారు. తనకు రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వదులుకున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రం నాయత్వ లేమితో కొట్టుమిట్టాడుతోందని, తన అనుభవం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. తెలుగదేశం పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని ఆయన చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే తన జీవితం అంకితమని ఆయన చెప్పారు.
దేశంలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేవారే లేరని ఆయన అన్నారు. తాము బిజెపి నేతృత్వంలోని ఎన్డీయె వైపు వెళ్తున్నామనడంలో నిజం లేదని ఆయన అన్నారు. శాసనసభా సమావేశాలను నిర్వహించడం సాధ్యం కాకపోతే అధికారం నుంచి తప్పుకోవాలని ఆయను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చురక వేశారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస అన్నీ ఒక్కటేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications