వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ నుండే లీడ్ చేస్తున్న బొత్స, సమావేశాలపై దృష్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తరఫున ఏ ఫారాలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ రాక కోసం

Botsa Satyanarayana
ఢిల్లీలో ఎదురు చూస్తున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడి నుంచే రాష్ట్ర పరిణామాలపై ఒక కన్ను వేసి ఉంచారు. అసెంబ్లీలో జరుగుతున్న చర్చను టీవీలలో గమనిస్తున్న బొత్స సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోవడంతో విప్ గండ్ర వెంకటరమణా రెడ్డితో మాట్లాడారు. ఆరుగురు విప్‌లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు కూడా సభలో ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉండడం పార్టీ ప్రతిష్ఠకు మంచిది కాదని ఆయన చెప్పారు. కాగా విద్యామంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా ఆయన మంతనాలు జరిపారు.

ఉప ఎన్నికల్లో అభ్యర్థులను సర్వే ద్వారా ముఖ్యమంత్రి ఎంపిక చేసినందువల్ల ఆయన ఇష్టాయిష్టాలకే తాను ప్రాధాన్యతనిచ్చినట్లు దామోదర్‌తో చెప్పినట్లు సమాచారం. ఒక్క మహబూబ్‌నగర్ విషయంలోనే ఒకే జిల్లాలో ముగ్గురు రెడ్లకు సీట్లు ఇవ్వడం, షబ్బీర్ అలీ స్థానంలో కూడా ఆయన సూచించిన రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థికి ఇవ్వడంతో విజయ లక్ష్మికి చివరి నిమిషంలో సీటు ఇవ్వలేకపోయామని ఆయన వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి గట్టిగా పట్టుపడితే మహబూబ్‌నగర్‌కు విజయ లక్ష్మిని ఎంపిక చేసి ఉండేవారమని, కాని ఆయన కూడా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడ్డారని బొత్స చెప్పినట్లు తెలిసింది. గురువారం ఆజాద్‌ను కలిసి ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana leading party from New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X