తెరాసలోకి నాగం వస్తారు, బిజెపిపై నో కామెంట్: కెసిఆర్

అసెంబ్లీ సమావేశాల కంటే మనకు ఉప ఎన్నికలే ముఖ్యమని, అయినా అసెంబ్లీకి పోయి చేసేది ఏముందని, ఎలాగూ సభ నుంచి సస్పెండ్ చేస్తారు కదా అని అన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలంతా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారంలో పాల్గొనాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఈ సందర్భంగా పార్టీ నేతలకు కెసిఆర్ వివరించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో టిడిపి అభ్యర్థికి డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందని, అక్కడా ఆ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా చేయాలని అన్నట్లుగా సమాచారం. అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందటానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడేలా చూడాలన్నారు. మహబూబ్‌నగర్‌పై రగడ నేపథ్యంలో బిజెపిపై పార్టీ నేతలెవరూ పెదవి విప్పొద్దని ఆయన ఆదేశించారు.


Click it and Unblock the Notifications