టిడిపిలో విలీనం చేస్తారా: కెసిఆర్‌కు రేవంత్ ఆఫర్

తెలంగాణకు అనుకూలంగా తాము చంద్రబాబుతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇప్పిస్తామని, తమ పార్టీలో తెరాసను విలీనం చేయాలని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ నేతలు ఏం చెప్పారో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము చిదంబరంతో భేటీలోనూ తెలంగాణనే కోరామన్నారు. అధికార కాంగ్రెసు పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ వారిని అదుకుంటోందని అన్నారు. తమను ఆదుకున్నప్పుడల్లా కాంగ్రెసు వారికి ఏదో ఒక ప్యాకేజీ కట్టబెడుతోందని అన్నారు. అలజడి సృష్టించి ప్యాకేజీ పొందుతారని టిఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు. మద్యం సిండికేట్ల వ్యవహారంపై చర్చ జరిగేటప్పుడు టిఆర్ఎస్ అలజడి సృష్టించడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications