హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సభలో వైయస్ విజయమ్మ, బడ్జెట్ సెషన్స్‌కు తొలిసారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు వారం రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆమె హాజరు కాలేదు. గురువారం తొలిసారిగా ఆమె హాజరయ్యారు. కాగా గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. స్పీకర్ విపక్షాలు ఇచ్చిన తీర్మానాలనన్నింటినీ తిరస్కరించారు. మద్యం సిండికేట్లపై తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై సిపిఎం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సిపిఐ, తెలంగాణ ఉద్యోగులపై కేసులు ఎత్తి వేయాలని బిజెపి తీర్మానాలను ఇచ్చాయి. స్పీకర్ వాటిని తిరస్కరించారు.

కాగా విద్యాశాఖ మంత్రి పార్థసారథి తన తీరు మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా పార్థసారథి ప్రవర్తన అభ్యంతరకరమన్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

English summary
YSR Congress Party MLA YS Vijayamma came to budget sessions on thursaday first time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X