25 ఏళ్లుగా రాజ్యసభ పదవి లేదు: వైయస్ వివేకానంద

కాగా వైయస్ వివేకానంద రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభ సీటు తనకు ఇవ్వమని అడిగేందుకు ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, మిగిలిన పార్టీ నేతలను కలిసి ఆయన తనకు పదవి ఇవ్వాలని కోరారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలో విలేకరులతో వివేకానంద మాట్లాడారు. తాను రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీ వచ్చానని చెప్పారు. తమ పార్టీకి జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి రెండూ శతృవులేనన్నారు. తనకు పదవి వచ్చినా రాకున్నా జగన్ పార్టీలో చేరేది లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు అమలు పరచడం లేదని జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమన్నారు.