వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌లో కాల్పులు, పేలుళ్లు: 32 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

బాగ్దాద్: ఇరాక్ మరోసారి నెత్తురోడింది. వరుస పేలుళ్లు, తుపాకి కాల్పులతో దద్ధరిల్లింది. ఈ సంఘటనల్లో 32 మంది దాకా మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కేంద్రంగా ప్రజ్వరిల్లిన హింసలో 22 మంది మరణించారు. బాగ్దాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. రోడ్డు పక్కన పెట్టి పేల్చడంతో పాటు తుపాకి కాల్పులకు కూడా దుండగులు పాల్పడ్డారు.

బగ్దాద్‌కు ఉత్తరంలో ఉన్న షియాల ప్రార్థనలకు సంబంధించిన జిల్లా కధిమియా జిల్లాలో కారు బాంబు పేలింది. ఈ సంఘటనలో ఆరుగురు మరణించారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. అధమియాలో సాయుధులు పోలీసు చెక్‌పోస్టుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.

కర్రాడ జిల్లాలోని పోలీసు చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలింది. ఇందులో ఓ వ్యక్తి మరణించాడు. 11 మంది గాయపడ్డారు. అదే ప్రాంతంలో మరో బాంబు పేలింది. మొదటి పేలుడు తర్వాత అర గంటకు జరిగిన ఈ పేలుడులో మరో వ్యక్తి మరణించాడు. ఆరుగురు గాయప్డడారు. దురాలో రోడ్డు పక్కన బాంబు పేలి ఇద్దరు మరణించారు, పది మంది గాయపడ్డారు. అబు షిర్ రెస్టారెంట్ వద్ద రెండు బాంబులు పెలి ఇద్దరు మరణించారు. పది గాయపడ్డారు. మన్సూరులో కారు బాంబు పేలి ఇద్దరు మరణించారు, ఐదుగురు గాయపడ్డారు. దియాల్ ప్రొవిన్స్‌లో రెండు కారు బాంబులు పేలి ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇంకా పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల్లో మరణాలు సంభవించాయి, చాలా మంది గాయపడ్డారు.

English summary
A wave of bombings and shootings across Iraq killed at least 32 people and wounded dozens more on Thursday, security officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X