హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కేసు: అరెస్టు, విడుదల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్/నల్గొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట శాసనసభ్యుడు కిషన్‌ రెడ్డిపై భువనగిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 నవంబర్ 9న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపుమేరకు నిర్వహించిన రైలు రోకోలో పాల్గొన్న ఆయనతోపాటు మరో తొమ్మిది మంది బిజెపి, టిఆర్ఎస్, జెఏసి నాయకులపై కేసు నమోదైంది. ఈ మేరకు వీరు శుక్రవారం భువనగిరి రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో బెయిల్ తీసుకోవాలని గురువారం పోలీసులు తెలిపారు.

కాగా రైలు రోకోలో అభియోగం ఎదుర్కొంటున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ స్టేషన్‌లో లొంగి పోయారు. పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కిషన్ రెడ్డిని తొలుత అరెస్టు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌పైన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే ముందుకు రైళ్లను నిలిపివేసి కేవలం పట్టాల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Bhuvanagiri railway police booked case against BJP state president Kishan Reddy on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X