ఉండవల్లి చెబితే కిరణ్ కుమార్ రెడ్డి వినలేదు: డిఎల్
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: గత సంవత్సరం డిసెంబరులో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి మూజువాణి ఓటు కోసం ప్రయత్నించారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శుక్రవారం అన్నారు. అయితే వారు మూజువాణి ఓటు కోసం ఎంతగా ప్రయత్నించినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోలేదన్నారు. మూజువాణి ఓటుతో అవిశ్వాసం పెడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేసే అవసరం ఉండేది కాదన్నారు.
జగన్ వర్గం శాసనసభ్యులపై మరో మూడు రోజుల్లో వేటు వేసే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఉప ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. నాలుగేళ్ల క్రితం 2008లో ఎన్నికలు వచ్చినప్పుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎలా ప్రచారం విస్తృతంగా చేపట్టారో ఇప్పుడు కూడా కిరణ్ అలాగే చేపట్టాలన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు మూడో స్థానానికి పడిపోతే పార్టీ రాష్ట్రంలో నాశనమైనట్లేనని అన్నారు.