మోండాలో కుప్పకూలిన రెస్టారెంట్ బిల్డింగ్, పలువురి మృతి

Charminar
హైదరాబాద్: నగరంలో ఓ రెస్టారెంట్ భవనం ఒక్కసారిగా కుప్పకూలి పోవడంతో పలువురు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. మోండా మార్కెట్‌లోని ఓ పాత భవనానికి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు ఫుట్ పాత్ వ్యాపారులు అని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో పది మంది వరకు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను మహాత్మా గాంధీ హాస్పిటల్ చికిత్స నిమిత్తం తరలించారు.

ఈ భవనం కూలడం వల్ల నాలుగు దుకాణాలు ధ్వంసమయ్యాయి. కాగా ఈ భవనంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తోంది. అయితే మరమ్మతుల నిమిత్తం కొంతకాలం క్రితం దీనిని మూసి వేశారు. ఇది రెండంతస్థుల భవనం. ఘటనా స్థలానికి పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి చేరుకున్నారు. కాగా భవనం కూలి సహాయక చర్యలు కొనసాగుతుండటం వలన అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+