చంద్రబాబు చిన్న మెదడు చితికింది: హరీష్ రావు

ముగ్గురు కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామా చేసి తమ పార్టీలో చేరారని, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డి. శ్రీనివాస్‌ను ఓడించిన చరిత్ర తమకు ఉందని, చంద్రబాబు కాంగ్రెసుకు మద్దతిచ్చారని అంటూ కాంగ్రెసుతో కుమ్మక్కయిందా చంద్రబాబా, తామా అని ఆయన అడిగారు. గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తెలుగుదేశం నాయకులు బాబ్లీ డ్రామా ఆడారని, అయినా డిపాజిట్లు కూడా రాలేదని, ఇప్పుడు తెలంగాణ అమర వీరుల పేరుతో మరో డ్రామా ఆడబోతున్నారని ఆయన అన్నారు. బాబ్లీ వ్యవహారంలో పోలీసు స్టేషన్లో పడినా ప్రజలు తెలుగుదేశం పార్టీని విశ్వసించలేదని, తెలుగుదేశం పార్టీ విశ్వాసం తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిందని, తెలుగుదేశం పార్టీ ఖతమైందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఖతమైన విషయం చంద్రబాబుకు కనిపించడం లేదని, తెరాస పని అయిపోయిందని అంటున్నారని ఆయన అన్నారు.
తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చంద్రబాబు వేయి సార్లు చెప్పారని, దానికి బదులు ఒక్కసారి తాను తెలంగాణకు అనుకూలమని చెప్తే ప్రజలు నమ్ముతారని, అయితే చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరని, తెలంగాణద్రోహిగానే మిగిలిపోతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications