హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరూ కోరితే ఓకే, తర్వాత మాత్రం ఆడగవద్దు: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రైతు సమస్యలపై మంగళవారం సభలో వాడిగావేడిగా చర్చ జరిగింది. ప్రతిపక్షాలు బియ్యం ఎగుమతిపై ఆంక్షలు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ... అందరూ కోరితే బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసేందుకు సిద్ధమని కానీ ఆ తర్వాత బియ్యం ధరలు పెరిగితే తమను అడగవద్దని ఆయన విపక్షాలకు సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ధాన్యం తరలింపుపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 95 లక్షల మందికి వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతు సమస్యలపై చంద్రబాబు అధికార పక్షాన్ని నిలదీశారు. రాష్ట్రంలో 82 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారన్నారు. వినియోగదారుడి కోసం రైతును బలి చేశారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర లభించడం లేదని ఆయన అన్నారు.

ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు పోతోందన్నారు. రైతులకు ప్రభుత్వం, సభ నమ్మకం కలిగించాలని సూచించారు. వ్యవసాయరంగంలో మార్పుల వచ్చి రైతులకు న్యాయం జరగాలంటే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. ఎరువుల ధరలు భారీగా పెంచారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించమని అడిగినా ఎందుకు తగ్గించలేదన్నారు. బియ్యంపై వెంటనే ఆంక్షలు ఎత్తి వేయాలన్నారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం సభ నుండి వాకౌట్ చేశాయి. ఆంక్షలను వ్యతిరేకిస్తూ గ్రామస్థాయి నుండి ఉద్యమం నిర్మిస్తామని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.

English summary
CM Kiran Kumar Reddy responded on rice export restructions in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X