హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేల సీట్లకు జూన్ లోగా ఎన్నికలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Election Commission
హైదరాబాద్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా శానససభలో ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్యలు తీసుకుంటే జూన్‌లోగా ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. విప్ ధిక్కరించిన శాసనసభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేస్తే జూన్‌లోగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ (ఈసి) వర్గాలు మంగళవారం చెప్పాయి.

రాష్ట్రపతి ఎన్నికల లోపలే వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఆ వర్గాలు చెప్పాయి. అయితే స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తేనే ఇది సాధ్యమవుతుంది. కాగా, వారంలోగా రాజ్యసభ ఎన్నికలు నిర్వహణకు చర్యలు ప్రారంభిస్తామని ఆ వర్గాలు చెప్పాయి. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకోదలుచుకుంటే స్పీకర్ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అది సాధ్యం కాదని అంటున్నారు.

ఇదిలా ఉంటే, నెల్లూరు జిల్లా కోవూరు స్థానంలో కాంగ్రెసు పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెసు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపించింది.

English summary
EC ready to conduct bypolls by June, if speaker Nadendla Manohar takes action against YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X