హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిపిఐ నారాయణ మద్దతు కెసిఆర్‌కా, బాబుకా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Narayana-Chandrababu Naidu
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో సిపిఐ ఎవరికి మద్దతిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటు తెలుగుదేశం నాయకులు, అటు కెసిఆర్ మంగళవారం సాయంత్రం నారాయణతో సమావేశమై మద్దతు కోరారు. తాము కార్యవర్గంలో చర్చించి మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని నారాయణ చెప్పారు. తెలంగాణకు సిపిఐ అనుకూలంగా ఉన్నందున తమకే మద్దతు ఇస్తుందనే ఆశాభావాన్ని కెసిఆర్ వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికల్లో మద్దతు కోరడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణతో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. తమకు మద్దతిచ్చి తెలంగాణవాదాన్ని మరింత బలోపేతం చేయాలని కెసిఆర్ నారాయణను కోరారు. సిపిఐ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కెసిఆర్ మద్దతు కోరడానికి వీలైంది.

సిపిఐకి, తెలంగాణకు మధ్య అవినాభావ సంబంధం ఉందని, సాయుధ పోరాటం సాగించిన పార్టీ సిపిఐ అని, తెలంగాణకు అనుకూలంగా జాతీయ కార్యవర్గం కూడా నిర్ణయం తీసుకుందని, అనేక విషయాల్లో భావసారూప్యత ఉంది కాబట్టి కలిసి పని చేద్దామని అడిగామని కెసిఆర్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రేపు కార్యవర్గంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని సిపిఐ నేతలు చెప్పారని ఆయన అన్నారు. తమకు మద్దతు ప్రకటిస్తుందని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.

కాగా, అంతకు ముందు నారాయణతో తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై కేంద్ర కమిటీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలుగుదేశం నాయకులతో చెప్పారు.

English summary
TDP leaders and TRS president KCR separately met CPI secretary Narayana and appealed for support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X