హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సార్వత్రిక సమ్మె పాక్షికం: నారాయణ, రాఘవులు అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

BV Raghavulu and CPI Narayana
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన 24 గంటల బంద్ పిలుపుకు దేశవ్యాప్తంగా పాక్షిక స్పందన కనిపించింది. కొన్ని చోట్ల బ్యాంకింగ్ వ్యవస్థలు, రవాణా రంగం ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో బస్సులు తక్కువగానే రోడ్డెక్కాయి. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మాత్రం చాలావరకు తెరుచుకున్నాయి. బంద్ పాటిస్తే సర్వీస్ బ్రేక్ గా ట్రీట్ చేస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించిన విషయం తెలిసిందే. కోల్ కతాలో పరిస్థితి అంతా అదుపులోనే ఉందని డిజిపి చెప్పారు. కొన్ని అరెస్టులు మినహా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనలేదని చెప్పారు.

బ్యాంకింగ్, ఇన్సురెన్స్ తదితర రంగాల పైన బంద్ ప్రభావం అంతగా ఏమీ పడలేదు. బంద్ ప్రభావం కేరళలో కనిపించింది. అక్కడ బస్సులు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరవలేదు. యుపిఏ విధానాలు నిరసిస్తూ బ్యాంకులు, కార్యాలయాలు అన్నింటిని మూసివేశారు. కాగా కేరళలో అధికారంలో ఉన్న యుడిఎఫ్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో నో వర్క్ నో పే ఆర్డర్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో అధికారులు సమ్మెలో పాల్గొనకుండా ఒప్పించారు.

కాగా ఆంధ్ర ప్రదేశ్‌లోను బంద్ ప్రభావం పాక్షికంగానే కనిపించింది. జిల్లాలలోని ప్రధాన నగరాల్లో కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. హైదరాబాదులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాఘవులు తదితరులు అరెస్టయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమ్మెతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని హెచ్చరించాయి. సార్వత్రిక సమ్మెకు సిఐటియు, ఏఐటియుసి, హెచ్ఎంఎస్, ఐఎన్‌టియుసి, బిఎంఎస్ మద్దతు పలికాయి.

English summary

 The 24-hour country-wide strike called by major trade unions on Tuesday to protest ‘anti-labour’ policies of the government and rising prices evoked a mixed response with the banking and transport sector hit in some parts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X