హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫైల్ తీసుకు రావాలన్న బాబు, అలవాటేనన్న కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Kiran Kumar Reddy
హైదరాబాద్: పోలవరం టెండర్ల అంశంపై శాసనసభలో బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్య వాగ్వాదం జరిగింది. పోలవరం టెండర్లలో అవకతవకలు జరిగాయని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. టెండర్లపై విధిగా చర్చ జరగాలని అన్నారు. పోలవరం టెండర్ల ఫైళ్లను స్పీకర్ ఎదుట పెట్టాలని డిమాండ్ చేశారు. బాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. టెండర్ల విధానం ఏమిటో చంద్రబాబుకు తెలియదని ఎద్దేవా చేశారు. పోలవరం టెండర్ల ఫైళ్లను నేను ఆమోదించలేదని చెప్పారు. పోలవరంపై కొత్తగా మరో రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఆరోపణలు చేయడం బాబుకు అలవాటే అన్నారు.

రాష్ట్రంలోని ప్రజలకు చెందాల్సిన ఆస్తి ఒక్క కుటుంబమే చేజిక్కించుకుందని తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా తాము గౌరవిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీల్డ్ కవర్లో వచ్చారా సూట్ కేసులతో వచ్చారా అనేది తమకు సంబంధం లేదని అన్నారు. ఆయన ఎలా వచ్చినా రాష్ట్రంలో జరిగిన భారీ అవినీతిని వెలికి తీయాలని మేం ప్రయత్నించామన్నారు. కానీ మా ఆశలు నెరవేరలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగవుతుందో కూడా ప్రభుత్వానికి తెలియదన్నారు. విత్తనాల ఇండెంట్ ను కూడా సరిగా పంపడం లేదని విమర్శించారు. నెత్తురు చిందించకుండా రైతులకు విత్తనాలు దొరికే పరిస్థితి లేదని విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం ఏడేళ్ల కాలంలో ఏడువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలోన వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు.

English summary
Polavaram tenders issue created very tension in Assembly today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X