జగన్ కేసులో శ్రీలక్ష్మిని విచారించనివ్వండి: సిబిఐ

Srilaxmi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను విచారించడానికి అనుమతించాలంటూ హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. వీరి విచారణకు ప్రత్యేక కోర్టు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ బుధవారం ఈ పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దుచేయాలని, జగన్ అక్రమాస్తుల కేసులో ఆ ఇద్దరు అధికారులను ప్రశ్నించడానికి తమకు అప్పగించాలని కోర్టును కోరింది. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని ఫిబ్రవరి 14న సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

అయితే ఓఎంసి కేసులో నిందితులుగా జైలులోనున్న శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను సీబీఐ విచారణకు అప్పగించడానికి నిరాకరిస్తూ ఫిబ్రవరి 22న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. పెన్నా గ్రూపుతో పాటు పలు కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, అంతేగాక చాలా లీజుల ప్రక్రియలను వీరే చేపట్టారనడానికి ఆధారాలున్నాయని సిబిఐ తెలిపింది. అందువల్ల జైలులోనే వీరిని విచారించేందుకు అనుమతించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+