హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముందే తెలంగాణ ఇచ్చినా ఇబ్బంది లేదు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: 2014 ఎన్నికలకు ముందు కేంద్రం తెలంగాణ ప్రకటించినా తమ పార్టీకి ఏమాత్రం ఇబ్బంది లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణ ప్రకటించినా రెండు ప్రాంతాలలోనూ పార్టీ బలంగా ఉంటుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రజలు సుస్థిర నాయకత్వానికి మెజార్టీ ఇచ్చారన్నారు. మంచి నాయకత్వం ఇచ్చే పార్టీకి ప్రజలు ఓటేశారన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విభజన తీర్మానాన్ని అక్కడి ప్రజలు విశ్వసించలేదన్నారు. ఈ ఐదు ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అన్ని రాష్ట్రాలలోనూ ప్రజలు నాయకత్వం అందించే వాళ్లనే ఎన్నుకుంటారనే విషయం అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఒకరు వసూల్ రాజా అయితే మరొకరు అవినీతి రాజా అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట చంద్రశేఖర రావును, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస వద్ద డబ్బు బస్తాల్లో మూలుగుతోందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను వెలికితీయాల్సి ఉందన్నారు. గత ఉప ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలకు మార్పు ఉందని ఆయన చెప్పారు. ప్రజల కోసం ప్రతిపక్షంగా ప్రస్తుతం సభను మేమే నడిపిస్తున్నామని చంద్రబాబు అన్నారు. సభను ప్రభుత్వం నడిపించాల్సిన రోజులు ఎప్పుడో పోయాయని చెప్పారు. యుపిలో ఓ మాట, ఎపిలో ఓ మాట బిజెపి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu said that party will not affected if central government will give Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X