వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ప్రచారం కోసం పరకాల వస్తారు: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారానికి వస్తారని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ మంగళవారం స్పష్టం చేశారు. రాబోతున్న ఉప ఎన్నికలలో పరకాల నియోజకవర్గం నుండి భారీ ఆధిక్యంతో గెలుస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు మేరకే తాను కాంగ్రెసు పార్టీ విప్ ధిక్కరించి గత డిసెంబర్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశానని అన్నారు. తాను పోటీ చేసే పరకాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని పోటికి నిలబెడితే తెలంగాణ రాజకీయ జెఏసి ఖండించాలని ఆమె అన్నారు. రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయనే భయంతోనే తమపై అధికార కాంగ్రెసు పార్టీ వేటు వేసిందని ఆమె ఆరోపించారు.

కాగా గత సంవత్సరం డిసెంబర్ నెలలో టిడిపి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కొండా సురేఖ ఓటు వేసిన విషయం తెలిసిందే. పార్టీ విప్ ధిక్కరించి ఆమె ఓటు వేసింది. దీంతో స్పీకర్ విచారణ జరిపి ఐదు రోజుల క్రితం వేటు వేశారు. టిడిపి అవిశ్వాస తీర్మానానికి జగన్ వర్గానికి చెందిన పదిహేడు మంది శాసనసభ్యులు మద్దతుగా ఓటు వేశారు. వారందరిపై వేటు పడింది. అయితే మిగిలిన పదహారు మంది సీమాంధ్ర నేతలు కాగా కొండా సురేఖ మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత.

English summary
YSR Congress Party leader Konda Surekha said that party chief YS Jaganmohan Reddy will coming to Parakal for campaign in bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X