నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ భూమిపై కన్నేసిన సినీ నిర్మాత దిల్ రాజు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dil Raju
నిజామాబాద్: నిజామాబాదులోని ప్రభుత్వ భూమిపై తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు కన్నేసినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. నిజామాబాదులో మల్టిప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పత్రిక రాసింది. నీటిపారుదల శాఖకు చెందిన నాలుగు ఎకరాల భూమిపై ఆయన కన్ను పడినట్లు చెబుతున్నారు. ఆ భూమి విలువ ఎకరానికి కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా అది ఉంది.

ఆ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం - ఇటీవలి జిల్లా సమీక్షా సమావేశంలో స్థానిక శాసనసభ్యుడు యెండాల లక్ష్మినారాయణ ఆ విషయాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం నుంచి తమకు దరఖాస్తు అందిన మాట నిజమేనని, దాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ డి. వరప్రసాద్ చెప్పారు. దిల్ రాజుకు భూమి కేటాయించాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెసు నాయకుడొకరు ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది.

శాసనసభ మాజీ స్పీకర్ కె. సురేష్ రెడ్డి కూడా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గల 6 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చెప్పాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సురేష్ రెడ్డి ఆ స్థలంలో టూరిజం రిసార్టును అభివృద్ధి చేయాలని సురేష్ రెడ్డి అనుకుంటున్నారు. నిజామాబాద్ కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో గల ఆ స్థలం విలువ ఎకరానికి పది లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దిల్ రాజు, సురేష్ రెడ్డి నుంచి తమకు ఏ విధమైన దరఖాస్తులు రాలేదని జిల్లా రెవెన్యూ అధికారి పి. జగదీశ్వరాచారి చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.

English summary
Top Telugu film producer Dil' Raju is moving heaven and earth to get his multiplex constructed in the heart of the town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X