వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌లో మళ్లీ బిజెపి, శిరోమణి అకాలీదళ్ కూటమి

By Pratap
|
Google Oneindia TeluguNews

Panjab Map
చండీఘర్: పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ - బిజెపి కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. ప్రభుత్వ సానుకూల ఓటుతో ఆ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా సాగుతోంది. 117 స్థానాలున్న అసెంబ్లీలో 71 స్థానాల్లో కూటమి ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెసు 38 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతలో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదట్లో బిజెపి, శిరోమణి అకాలీదళ్‌ కూటమితో హోరాహోరీగా ముందుకు వస్తున్నట్లు కనిపించిన కాంగ్రెసు ఆ తర్వాత వెనకబడిపోయింది.

శిరోమణి అకాలీదళ్ 60 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా, బిజెపి 11 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. పంజాబ్ ఫలితాల పట్ల కాంగ్రెసు తీవ్ర నిరాశతో ఉంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ప్రకాశ్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్ తమ తమ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిజెపి పంజాబ్ రాష్ట్రాధ్యక్షుడు అశ్విని శర్మ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ అమృతసర్ తూర్పు స్థానంలో విజయం సాధించారు.

English summary
he SAD-BJP alliance was set to retain power in Punjab as it was leading in 71 out of the total 117 assembly constituencies
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X