జగన్ కొవూరులో ఓటుకు రూ.వెయ్యి ఇస్తారట!: కెఇ

TDP Logo
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన ప్రచారంలో ఓటర్లను తనకు ఓటు వేయమని అడగటం లేదని తెలుగుదేశం పార్టీ నేత కెఇ కృష్ణమూర్తి బుధవారం అన్నారు. ఉప ఎన్నికల్లో తనకు ఓటు వేయమని అడగకుండా తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కొవ్వూరు ఉప ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో ఓటుకు రూ.వెయ్యి పంచుతారని ప్రచారం జరుగుతోందని అన్నారు. గతంలో కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికలు జరిగినప్పుడు పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు అని అన్నారు.

అందుకే ఆయన కడప, పులివెందలలో డబ్బులు పంచలేదని, ఇప్పుడు మాత్రం డబ్బు పంచుతారని స్థానికంగా ప్రచారం జరుగుతోందని అన్నారు. నల్లపురెడ్డికి స్థానికంగా ఎదురు గాలి వీస్తుందన్నారు. అక్కడ టిడిపి గెలుపొందడం ఖాయమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీ పెద్దలు ఢీలా పడ్డారని మరో నేత నామా నాగేశ్వర రావు వేరుగా అన్నారు. జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం అనుకూలంగా కనిపిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+