తీర్పు శిరసా వహిస్తా: రాజీనామా తర్వాత మాయావతి

కాంగ్రెసు, బిజెపిలలో బహుజనులకు న్యాయం జరగటం లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయని, కానీ తమ పార్టీకి ఓటింగ్ శాతం మాత్రం తగ్గలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తన హయాంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ముస్లింల అభివృద్ధికి తోడ్పడ్డామన్నారు. ఐదేళ్లలో మంచి పాలన అందించామని ఆమె అన్నారు. ఓటమికి తానే బాధ్యత వహిస్తానని అన్నారు. కాంగ్రెసు, బిజెపి రాజకీయ స్వార్థం వల్లే ముస్లింలు ఎస్పీ వైపు మొగ్గారన్నారు. విధాన సభను రద్దు చేయాలని గవర్నర్‌కు సూచించానని చెప్పారు.












Click it and Unblock the Notifications