వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చమురు ధరల పెంపు: ఇండియాపై ఒబామా నిందలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Barack Obama
వాషింగ్టన్: దీర్షకాలంలో చమురు ధరలు పెరగడానికి భారత్, చైనా, బ్రెజిల్‌లే కారణమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిందించారు. ఈ దేశాల్లో ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని, దీని వల్ల ప్రపంచంలో చమురు ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ దేశాల్లో జనాభా ఎక్కువగా ఉందని, దాంతో ఇంధన అవసరాలు పెరిగి చమురు ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. నార్త్ కరోలినాలోని డైమ్లెర్ ట్రక్ తయారీ ప్లాంట్ కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

చైనాలో 2010లోనే దాదాపు పది మిలియన్ల కార్లు రోడ్డు మీదికి వచ్చాయని, పది మిలియన్లంటే ఆషామాషీ కాదని, చైనా, ఇండియా, బ్రెజిల్‌ల్లోని ప్రజలు కార్లు కోరుకుంటున్నారని, వారి జీవనప్రమాణాలు పెరుగుతున్నాయని, దాని వల్ల చమురు డిమాండ్ పెరుగుతుందని, ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెంపునకు దారి తీస్తుందని ఆయన అన్నారు.

ఈ పరిణామాలను బట్టి చూస్తే పాత పద్ధతుల్లో వ్యాపారం చెల్లుబాటు కాద అర్థమవుతోందని, ఇంధన కోసం కొత్త వనరులను అన్వేషించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సహజ వాయువు వంటివాటిపై దృష్టి పెడుతున్నామని ఆయన అన్నారు. దీనివల్ల ఈ దశాబ్దాంతానికి 6 లక్షల ఉద్యోగాలు కూడా ఏర్పడుతాయని ఆయన అన్నారు.

English summary
US President Barack Obama has warned that growing energy demands in populous and emerging economies like India, China and Brazil would be responsible for the increase in global oil prices in the long term.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X