తాగిన మైకంలో మిస్‌ఫైర్: తుపాకి పేలి ఒకరి మృతి

రాత్రి రాజేందర్ రెడ్డికి నర్సింహా రెడ్డి తన తుపాకిని చూపిస్తుండగా మిస్ ఫైర్ అయింది. దీంతో అతనిని వెంటనే రెమెడీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ రాజేందర్ రెడ్డి మృతి చెందాడు. అయితే వారు ఆ సమయంలో తాగి ఉన్నారని తెలుస్తోంది. రాజేందర్ మృతి చెందడంతో నర్సింహా రెడ్డితో పాటు అతని కూడా ఉన్న స్నేహితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే మిస్ ఫైర్ అయిందా కావాలనే చంపి మద్యం మత్తులో అని అంటున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నర్సింహ రెడ్డికి తుపాకి ఎక్కడిది, లైసెన్స్ ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications