హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇటు సెంటిమెంట్ అటు అభివృద్ధి: ప్రచారంలో పోటాపోటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Chandrababu Naidu
హైదరాబాద్: ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నేతలు ప్రచారంలో బిజీ అవుతున్నారు. ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల సమయమే ఉండటంతో ఆయా పార్టీల ముఖ్య నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వారు చెమటొడుస్తున్నారు. సీమాంధ్ర మొత్తం చూస్తున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. పార్లపల్లిలో చంద్రబాబు ఓటర్లకు హామీలు గుప్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.1000 నుండి రూ.1500 వరకు పింఛన్ ఇస్తామని, మత్సకారులను ఎస్టీల జాబితాలో చేరుస్తామని చెప్పారు.

రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రతిసారి అన్యాయం జరుగుతోందని, కాంగ్రెసు పార్టీ తరఫున మన ఎంపీలు 32 మంది ఉన్నా ఒరిగిందేమీ లేదన్నారు. అన్యాయం జరుగుతున్నా ఎంపీలు దద్దమ్మల్లా ఉండిపోయారన్నారు. పనికి మాలిన ఎంపీలు అన్నారు. జగన్ అవినీతిని చూసి ప్రజలు భయపడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి అవగాహన లేదని విమర్శించారు. కేంద్రానికి రాష్ట్రమంటే చులకన భావం అన్నారు. కిరణ్ కేంద్రాన్ని ప్రభావం చేయలేరన్నారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు రాకపోవడం దారుణమన్నారు. నల్లపురెడ్డిని సూటుకేసులతో కొన్న జగన్‌కు విలువల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ కేసులో 9 మంది జైళ్లో ఉన్నారని విమర్శించారు. వైయస్‌కు మొదట అమ్ముడు పోయింది నల్లపురెడ్డియే అన్నారు. తండ్రి శవం రాకుండానే సిఎం పదవి కోసం సంతకాలు చేయించడం విలువలకు నిదర్సనమా అని ప్రశ్నించారు.

మరోవైపు జగన్ కాంగ్రెసు, టిడిపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండు పార్టీలు కుమ్మక్కై వైయస్సార్సీని ఎదగనీయకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. బాబును ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెసు ఆయన సన్నిహితులకు భూములు కట్టబెట్టిందని విమర్శించారు. అదిలాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తెలంగాణ సెంటిమెంట్ విషయం కేంద్రానికి తెలుసునని చెబుతూనే, అభివృద్ధి కోసం కాంగ్రెసును గెలిపించాలని కోరారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆటోతో టిడిపి సైకిల్ బద్దలవుతుందని అన్నారు. నాగర్ కర్నూల్ స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి గుర్తు ఆటో. దీంతో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెసు చేయిని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. టిడిపిలో ఆంధ్రా గులాంలే పదవుల్లో ఉన్నారన్నారు. సీమాంధ్ర పార్టీలు ఒక్కటై తెలంగాణ రాకుండా అడ్డుకున్నాయని విమర్శించారు. రాజీనామా చేసిన వారికి ఓటు వేసి ఆంధ్రా పెత్తందార్ల పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు.

చంద్రబాబు తన హయాంలోని అభివృద్ధిని, తాను అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలపై హామీలు ఇస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తూనే అభివృద్ధి నినాదం ఎత్తుకున్నారు. ఇక కెసిఆర్ తెలంగాణ సెంటిమెంటును బలంగా ఉపయోగించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ప్రవేశ పెట్టిన పథకాల ప్రభుత్వం విస్మరిస్తుందని, తనపై కక్ష కట్టిందని చెబుతూ ప్రభుత్వం వైఫల్యం, సానుభూతితో గెలుపొందే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu, YSR Congress Party chief YS Jaganmohan Reddy, TRS chief K Chandrasekhar Rao and CM Kiran Kumar Reddy are busy with campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X