మీడియా ప్రతినిధులపై జాలి చూపిన జయసుధ

ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు.."మార్షల్స్, అసెంబ్లీ సిబ్బంది కోరగానే.. చాలా ఓపిగ్గా ఫొటోలు దిగుతున్నారు'' అని ఆమెతో అన్నారు. "తనతో ఫొటో దిగటం వల్ల వారికి ఆనందం కలిగితే అంతకంటే కావాల్సింది ఏముంది ?'' అని జయసుధ అంటూనే.. లాబీల్లో గంటల తరబడి ఎలా నిలబడుతున్నారంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. "ఏదైనా ముఖ్యమైన అంశం ఉన్నప్పుడైతే ఫరవాలేదు. కాని, రోజూ లాబీల్లో గంటల తరబడి నిలబడటం ఇబ్బందే. కనీసం మీరు కూర్చోవటానికి సీట్లు కూడా ఏర్పాటు చేయలేదు'' అంటూ ముందుకెళ్లిపోయారు.