హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేం స్కూల్ పిల్లలమా: విప్‌ల ఫోన్లపై కుతూహలమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kuthuhalamma
హైదరాబాద్: మేము ఏమైనా స్కూల్ పిల్లలం అనుకున్నారా అంటూ మాజీ మంత్రి కుతూహలమ్మ ప్రభుత్వ విప్‌లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేమైనా పిల్లలమా అసెంబ్లీకి రావాలంటూ ఉదయాన్నే ఎస్సెమ్మెస్‌లు ఇచ్చి, ఫోన్లు చేసి డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. సీనియర్ శాసనసభ్యులతో వ్యవహరించ తీరు ఇదేనా అన్నారు. మంగళవారం అసెంబ్లీలో తనకు ఎదురుపడ్డ పేర్ని నానితో ఆమె ఉదయం తొమ్మిదింటికి అసెంబ్లీకి ఎవరు వచ్చారు... ఎవరు రాలేదో చూసుకొని, రాని వారికి మెసెజ్‌లివ్వండి.. ఫోన్లు చేయండి.. అంతే తప్ప ఉదయాన్నే ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడమేమిటని అడిగారట.

ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని విప్‌లుగా తమకు బాధ్యతలు అప్పగించారని, ఆ మేరకు తాము అలా చేయాల్సి వస్తోందని పేర్ని నాని వివరణ ఇచ్చారు. కాగా ఇటీవల ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో కోరం లేక పలుమార్లు సభ వాయిదా వేయాల్సి వస్తున్న విషయం తెలిసిందే.

English summary
Former Minister Kuthuhalamma unhappy with Whips attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X