చిరంజీవి వర్గానికి టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు గాలం

చిరంజీవి పట్ల అసంతృప్తితో ఉన్న నాయకుల జాబితాను కూడా ఆ ఆంగ్ల దినపత్రిక క్రోడీకరించింది. కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, తోట త్రిమూర్తులు, మాజీ శాసనసభ్యుడు ఎం విష్ణువర్ధన్ రెడ్డి, వంగవీటి రాధాకృష్ణ, శానసభ్యురాలు వంగా గీత, పారిశ్రామికవేత్త రామచంద్ర ప్రభు, ఐఎఎస్ అధికారులు టి. చంద్రశేఖర్, వరప్రసాద్, మాజీ ఐఆర్ఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపి తలారి మనోబర్, మాజీ ఐపియస్ అధికారి డిటి నాయక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పత్రిక రాసింది. అయితే వీరిలో తోట త్రిమూర్తులుకు, కొత్తపల్లి సుబ్బా రాయుడుకు వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్లు ఇస్తారనే ప్రచారం సాగుతోంది.
2009లో చిత్తూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున శానససభకు పోటీ చేసిన ఎ శ్రీనివాసులు ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిపారు. గతంలో విద్యుచ్ఛక్తి మంత్రిగా పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడితో తెలుగుదేశం నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు చిరంజీవితో కలవడమే గగనమవుతోందని, మరో వైపు కాంగ్రెసు నాయకులు తమను పట్టించుకోవడం లేదని మాజీ ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద, చిరంజీవి వర్గం మొత్తం కాంగ్రెసుతో ఉండే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. కాంగ్రెసుకు చిరంజీవిపై తప్ప తమపై ఆసక్తి లేదని కూడా అంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications